ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి..
గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్..

సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి..
గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్..
ఎల్బీనగర్, మార్చి 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్, బెల్లయ్య నాయక్ అన్నారు. హస్థినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ను ఆమె ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడ అని అన్నారు. తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని కఠినమైన శిక్ష పడే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు. త్వరలోనే నేషనల్ ఎస్టీ కమిషన్ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List