క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

On
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

IMG-20250307-WA0556
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 12, న్యూస్ ఇండియా ప్రతినిధి:

ధూమపానం వీడితే?! దమ్ము కొట్టడం మానేసిన వాళ్ళే నిజమైన జీవిత విజేతలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మార్చి 2వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్  మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ ఆరోగ్యాన్ని,తద్వారా జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళు, కాలేజీల సమీపం లో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధిస్తూ .. "నో టుబాకో జొన్" గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి కి లేఖ రాసినట్టు తెలిపారు.తద్వారా పొగాకు రహిత భారతాన్ని నవ తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ రాష్ట్రపతి కి పంపిన ప్రార్థనలో వేడుకున్నట్టు తెలిపారు. 22 సంవత్సరాలుగా తను చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి కి రాష్ట్రపతి భవన్ స్పoదిస్తుందన్న ఆశా భావం రఘునందన్ వ్యక్తం చేశారు.తల్లి దండ్రులు కూడా తమ పిల్లల్ని ఓ..కంట  కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. ఒక వేళ పొగాకు ఉత్పత్తుల కు విద్యార్ధులు, యువత అలవాటు ఐనా..కటువుగా.. కర్కశంగా మందలించే బదులు.. ప్రేమ గా ఆప్యాయంగా మంద లిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని రఘునందన్ అభిప్రాయ పడ్డారు.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్