ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

On
ప్రాధమిక  మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 15, న్యూస్ ఇండియా : జిల్లాలో   ఉన్న  ప్రాధమిక  మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారుల ఆదేశించారు. 
మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ...  జిల్లాలో మొత్తం 34 సంఘాలకు    నిర్వహించవలసివున్నది. అందులో 11 మత్స్య పారిశ్రామిక సంఘాల కు  బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయని, మిగిలిన 23   ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల హ్యాండ్ రైజింగ్ ద్వారా  అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలఏర్పాటుకు కొరకు రెవెన్యూ అధికారులకు తగు చూచనలు జారీచేశారు . పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని, వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని కోపరేటివ్ అధికారులు ఆదేశించారు. జిల్లాలో ఏవైనా సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే గుర్తించి, పోలీస్ సిబ్బందిని నియమించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. సహకార శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘల ఎన్నికలను పూర్తి చేయాలన్నారు.  ప్రాధమిక  మత్స్య పారిశ్రామిక  సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  అయ్యేవరకు ఎన్నిక లులకు  ఏర్పాట్లు  పూర్తి  చేయాలనీ అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీసంజీవ్ రావు, జిల్లా మత్యశాఖాధికారి ఆర్ ఎల్ మధుసూదన్, డి పి ఓ సాయి బాబా, డి సి ఓ కిరణ్ కుమార్, ఆర్ డి ఓ లు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-15 at 7.24.32 PM

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.