ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు..
జై శ్రీరామ్ నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగించారు.
ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు..
ఎల్బీనగర్, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. రాములవారి మంగళధ్వని మేళాలతో, హారతులతో, పూలతో, మంగళకలశాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అనే నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మొత్తం మార్మోగించారు. పల్లకీసేవ, రథోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రాంతీయ ప్రజలు, భక్తులు, యాత్రికులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములై, భక్తి భావంతో రామనామాన్ని జపిస్తూ శ్రీరాముని కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించామని ఆలయ ట్రస్టి వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గుంటి లక్ష్మణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొంటున్నారని, ఈ కల్యాణ వేడుకల్లో సుమారు ఐదువేల మంది భక్తులు పాల్గొన్నారన్నారు. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు సూచించారు. సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రేమ్ కుమార్, అర్చక సంఘం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comment List