జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం.

On
జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం.

WhatsApp Image 2025-04-10 at 3.07.03 PMసంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా : జోగిపేట్ డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వ్యవసాయం ను పండగ గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత  నిర్మాణాలు చేపడుతున్నాం. 170 కోట్లతో సింగూరు కాలువలకు సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నాం. అందోల్ నియోజక వర్గం లో ఫార్మా కాలేజ్ , హాస్పిటల్ ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఫార్మా పిజి కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. సుల్తాన్పూర్ జేఎన్టీయూ త్వరలో విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందబోతుంది. చౌటకూర్ మండలానికి పీహెచ్సీ, ఆంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీవిబి, పాఠశాలను మంజూరు చేస్తాం. సింగూరును టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం.నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్, ట్రామా సెంటర్, 30 పడకల హాస్పిటలను మంజూరు త్వరలో మంజూరు చేస్తున్నాం. ఆందోల్ నియోజకవర్గం లో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అనుసరించాలి. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించాలి. అవి ఇక్కడ అమలు చేయాలి. సంగారెడ్డి జిల్లా లోని మిగిలిన నియోజక వర్గాల్లో ఆత్మ కమిటీలను త్వరలో నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు అంజయ్య, సుహాసిని రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆత్మ కమిటీ చైర్మన్ చైర్మన్ తిమ్మ రెడ్డి గారి మల్లారెడ్డి, 23 మంది సభ్యులు పాల్గొన్నారు. 

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.