గుర్రపు డెక్క ఆకు తొలగింపు

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండల పరిధిలోని సంగెం (భీమలింగం) మూసి ఉదృతంగా ప్రవహించడంతో మూసీలో కొలువై ఉన్న భీమ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారినీ గుర్రపు డెక్కా ఆకు కప్పేయడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది...భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సురకంటీ మరళీదర్ రెడ్డి తన స్వంత నిధులతో జేసిబిల సాయంతో గుర్రపు డెక్క ఆకును తొలగించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భీమ లింగం కాలువ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రెండు కోట్లు నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందుకే త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జక్కల వెంకటేష్, పడమటి వెంకటరెడ్డి , గర్దాసు మధు, మేకల మల్లేష్, ఉదయ్,శశికుమార్,భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు
Comment List