పెద్దకడుబూరు : షార్ట్ సర్క్యూట్ తో కాడెద్దు ను కోల్పోయిన రైతు కుటుంబానికి పరామర్శ..!

మదాసి మదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదాసి కురువ సుంకన్న.

On
పెద్దకడుబూరు : షార్ట్ సర్క్యూట్ తో కాడెద్దు ను కోల్పోయిన రైతు కుటుంబానికి పరామర్శ..!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం/ మార్చి 30 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో మంగళవారం 25వ తేదీన కురువ వెంకటేష్ అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం తన రెండు కాడెద్దు లను పొలానికి తీసుకెళ్లడం జరిగింది. వ్యవసాయ పనులు ముగిసాక రైతు తన ఎద్దులను మేత కోసం పొలంలో వదలగ, మేత మేస్తున్న ఓ కాడెద్దు పొలంలోని స్థంభం ప్రక్కన క్రిందికి వేలాడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో దురదృష్టవ శాత్తు అక్కడికక్కడే కుప్పకూలి కాడెద్దు మృతి చెందడం జరిగింది. అయితే సుమారు 50 నుంచి 60వేల రూపాయలు కరీదుతో తెచ్చుకున్న ఆ కాడెద్దు మృతితో యజమాని అయినా రైతు కురువ వెంకటేష్ కన్నీమున్నీరుగా ఆవేదనతో రోధించాడు. చాలా కాలంగా తన పొలంలో కరెంట్ తీగలు క్రిందికి వేలాడుతున్న కూడా విద్యుత్ అధికారులు ఎవ్వరు పట్టించుకోలేదని రైతు ఆవేదనతో విలపించడం జరిగింది. అయితే ఈ సంఘటనను గురించి తెలుసుకున్న మదాసి మదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదాసి కురువ సుంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదాసి కురువ కలుగట్ల శివన్న మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లప్ప, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ లు ఆదివారం పెద్దకడుబూరు గ్రామం చేరుకొని కాడెద్దు ను కోల్పోయిన రైతు కురువ వెంకటేష్ కుటుంంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదాసి మదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదాసి కురువ సుంకన్న మాట్లాడుతూ ఈ దుర్గటన గురించి తెలుసుకొవడం జరిగిందని, పొలంలో విద్యుత్ తీగలు తగిలి కాడెద్దు మృతి చెందడంపై పూర్తిగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఎద్దేవచేసారు. పొలంలో క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల వైపు సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంతోనే కాడెద్దు మృతి చెందిందన్నారు. కాడెద్దు మృతి చెందిన మరుసటి రోజు విద్యుత్ అధికారులు పొలంలో వేలాడి ఉన్న తీగలను స్తంభం పైకి లాగించడం జరిగిందని, అయితే విద్యుత్ అధికారులు ముందుగానే క్రిందికి ఉన్న కరెంట్ తీగలను పైకి లాగించి ఉంటే కాడెద్దు మృతి చెందేది కాదని అన్నారు. ఒకవేళ ఆ కరెంట్ తీగలు పొలంలో వ్యవసాయ పనులకు చేస్తున్న రైతులకు గాని లేదా కూలిలకు గాని తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తెలిపి, ప్రభుత్వం ద్వారా ఈ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు. రైతుల పొలాలలో ఈ విదంగా ప్రమాధకరమైన కరెంట్ తీగలపై చర్యలు తీసుకోవాలని, మరి ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సంబందిత పై స్తాయి విద్యుత్ అధికారుల దృష్టికి కూడా తెలుపుతామన్నారు. కచ్చితంగా మా కురువ కులానికి చెందిన రైతు కురువ వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరిగే విదంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం కురువ సంఘం అధ్యక్షుడు దిద్దికాటి భీరప్ప, సంఘ పెద్దలు కోరి శివన్న, ఎస్.మల్లికార్జున, కమ్మలదిన్నె లక్ష్మన్న, ఉరుకుందప్ప, అల్లప్ప మరియు తదితరులు పాల్గొన్నారు...IMG_20250330_185647

Views: 145
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి... ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి... స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి... ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి... *ఎల్బీనగర్, ఏప్రిల్ 02...
తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ మొదలు
రేషన్ మాఫియా కు బేడి లు ఖాయం..
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తుమ్మల యుగేందర్
రంజాన్ – ఓ ఔదార్యపు సందేశం
పెద్దకడుబూరు : షార్ట్ సర్క్యూట్ తో కాడెద్దు ను కోల్పోయిన రైతు కుటుంబానికి పరామర్శ..!
పెద్దకడుబూరు : సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!