నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం
వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం నాయి బ్రాహ్మణ సమావేశం రాచమల్ల తిరుపతయ్య ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం జిల్లా ఉపాధ్యక్షులు నాగెల్లి వలి పాల్గొని వారు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాయి బ్రాహ్మణులకు సంక్షేమానికి 30 కోట్లు 100 కోట్లు విద్యుత్ బకాయి సబ్సిడీకి ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ఏ మూలానికి సరిపోదని నాయి బ్రాహ్మణులకు మహిళ వృత్తిదారులకు 500 కోట్లు కేటాయించాలని కరోనా వచ్చినప్పటినుండి ఇప్పటివరకు వృత్తి నడవక నాన్న ఇబ్బందులు పడి మా వృత్తిలోనికి కార్పొరేట్ సెలూన్లు రాకుండా అడ్డుకట్ట వేయాలని మాకు జీవో ఇవ్వాలని మా సంక్షేమానికి మా అభివృద్ధికి రుణాలు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న ఉచిత విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని భారీగా నష్టపోతున్న నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇండ్లు లేని పేదలకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని ప్రభుత్వం మాకు ఇంకా 500 కోట్లు కేటాయించాలని అంతేకాకుండా వృత్తి శిక్షణ మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ ఇవ్వాలని గత ప్రభుత్వం బీసీ బందు కింద లక్ష రూపాయలు వృత్తిదారులు అందరికీ ఇవ్వలేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను గుర్తించి రాజీవ్ యువ వికాస్ పథకంలో నాయి బ్రాహ్మణులను గుర్తించాలని 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ హాస్టల్లో హాస్పటల్లో పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను పర్మిట్ చేయాలని తెలంగాణ ప్రతి ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో బార్బర్ షాప్ నెలకొల్పాలని గ్రామీణ పట్టణ ప్రాంత నాయి బ్రాహ్మణులకు రక్షణ కల్పించాలని నాయి బ్రాహ్మణలు కు ప్రత్యేకంగా ఐడి కార్డు ఇవ్వాలని కోరారు అదేవిధంగా జూన్ నెలలో అన్ని మండలాలలో గ్రామాలలో నూతన కమిటీలను ఎన్నుకోవాలని ఆగస్టులో జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగేల్లి రాములు పట్టణ అధ్యక్షులు నాగేల్లి పాండు నాగేల్లి కృష్ణ నాగేల్లి నగేష్ కడారి దయాకర్ నాగలి ప్రభాకర్ రాచమల్ల విజయ్ జంపాల భార్గవ్ రాచమల్ల మహేష్ రాచమల్ల మహేష్ జంపాల మధు రాచమల్ల వినోద్ నాగేల్లి భాను ప్రజ్ఞాపురం విగ్నేష్ రాచమల్ల ఉమాపతి దడిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు
Comment List