ఇరిగేషన్ శాఖ 'రెండు నాల్కల' ధోరణి.!
నాలా ధ్వంసం నిజమే అని నిర్ధారణ. అది 'నాలా' కాదు.! అంటూనే.. నో అబ్ జేకేషన్ సర్టిఫికెట్ జారీ.! 'నాలా' రీ-కన్స్ట్రక్షన్ కు అనుమతులు ఇవ్వలేదని నిర్ధారణ.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 22, న్యూస్ ఇండియా : అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడి ‘అన్నం పెట్టె శాఖకు సున్నం పెట్టే’ విదంగా సంగారెడ్డి ఇరిగేషన శాఖ లో కొంతమంది ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని గణపతి నగర్ కాలనీ వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కండ్లు ఉండి చూడలేని గుడ్డితనం అన్నట్టు పరిస్థితులు తయ్యారైనాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేని విదంగా పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలోని, గణపతి నగర్, కలెక్టరేట్ కార్యాలయానికి ముందు మురళీకృష్ణ ఆలయ మార్గంలో గురువారం నాడు ఇరిగేషన్ శాఖ ఈఈ, డిఈ, ఏఈ లు కలసి అనుమతులు లేకుండానే ‘నాలా రి-కన్స్ట్రక్షన్’ జరుగుతున్నా కట్టడాన్ని పర్యవేక్షించారు. పర్యవేక్షణ జరుగుతున్నా సమయంలో కొంతమంది పాత్రికేయులు కొన్ని ప్రశ్నలను సందించగా? డిఈ, ఏఈ లు అసహనం వ్యక్తపరిచారు. ఆ సందర్భంలో అక్కడవున్న కొంతమంది పాత్రికేయుల సమక్షంలో ఇరిగేషన్ శాఖ ఈఈ అడిగిన ప్రశ్నలకు డీఈ, ఏఈ లు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఈ విషయాన్నీ మునిసిపల్ శాఖ సంగారెడ్డి వారిపై నెట్టివేసి వారు చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తున్నట్టు వారి గుసగుసలు స్పష్టంగా పాత్రికేయుల చెవిలో పడ్డాయి.
Comment List