భూభారతి చట్టం పారదర్శకమైనది.

భూ సమస్యల పరిష్కార మార్గాలు సులభం.

On
భూభారతి చట్టం పారదర్శకమైనది.

భూ భారతి తో అధికారాల వికేంద్రీకరణ. జియో మ్యాప్, జియో కోడ్ లతో పక్క గా హద్దుల నిర్ణయం. రైతులకు భూమి గుండె కాయ. భూ సమస్యలు త్వరితగతిన సులభంగా పరిష్కరించబడతాయి. నిర్ణీత గడువులోపు భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం. భూ భారతి చట్టం అవగాహన సదస్సులలో కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం మొగుడుంపల్లి  మండలలోని ప్రైవేట్ ఫంక్షనల్ లో  భూభారతి చట్టం అవగాహన సదస్సులలో  అదనపు కలెక్టర్ మాధురి ,తో  కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతులకు.చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్  ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్ ఓ ఆర్) చట్టం - 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా సీసీఎల్ఏ కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణి లో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.  రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. కాగా, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి  చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ సదస్సులలో ఆర్డీవో రామిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.Screenshot 2025-04-21 180558

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News