బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే

On

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ 
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం లో 
వివాహం ఆలస్యమవుతోందని ఆత్మహత్య చేసుకున్న యువతి  కుటుంబ సభ్యలను పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి బుధవారం రాత్రి పరమర్శించారు జనగామ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుగులోతు నీలా (26) గత రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే యువతిని కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, యువతుల జీవితాల్లోని ఒత్తిడులు, అజ్ఞానం అప్రమత్తత  పెను సమస్యలుగా మారుతు యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన చెందారు 
"ఇలాంటి సంఘటనలతో బాధిత కుటుంబ సభ్యుల హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె అన్నారు 
ఒక్క వివాహం కావడం లేదని జీవితాన్ని కోల్పోతే కుటుంబం లో ఎంతటి విషాదకరం ఉంటుందో బాధిత కుటుంబాలను చూస్తే అర్ధం అవుతుందన్నారు మన యువత మానసిక ధైర్యం ఇచ్చే సమాజంలో భాగస్వామ్యం కావాలన్నారు అందుకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, పెద్దలు ఈ అంశాల్లో చైతన్యం కలిగి ఉండాలి  అని ఎమ్మెల్యే అన్నారు. నీల తనకు కూడ మహిళా గన్ మెన్ గా రావాలనుకుందని అయితే ఇంతలోనే ప్రాణం తీసుకోవడం తననేంతో కలిచివేసిందన్నారు 
 కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్బంగా వ్యక్తిగత సహాయన్నదించి కుటుంబ సభ్యులను ఓదార్చారు
ఈ ఘటనపై ఎమ్మెల్యే చూపిన మానవత్వం పట్ల గిరిజన పెద్దలు అభినందనలు తెలిపారు,

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.