పుష్పతరహాలో గంజాయి రవాణా 

రు,, 3,63,68,000 విలువగల నిషేధిత గంజాయి పట్టుకున్న పోలీసులు

On
పుష్పతరహాలో గంజాయి రవాణా 

పోలీస్ సిబ్బందిని ఆభినందించిన ఎస్పీ రోహిత్ రాజు 

 కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) ఏప్రిల్ 12:కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో UP82A19894 నంబరు గల లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 727.360కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది. సుమారుగా 3,63,68,000/- రూపాయల విలువ గల ఈ గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.శిIMG-20250412-WA2033వమ్ గుప్తా,రియల్ ఎస్టేట్ వ్యాపారి,జగదీష్పుర, బోదలా, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను వ్యక్తి శనివారం పట్టుబడిన లారీ డ్రైవర్ భూరి సింగ్ , నాగుల బుద్ధ గ్రామం ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ మరియు రవి కుమార్, భోగపురం గ్రామం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను ఇద్దరు వ్యక్తులకు ఈనెల 8వ తేదీన నగదును ఇచ్చి అల్లూరి జిల్లా, చింతూరు మండలంలోని తులసిపాక గ్రామ అటవీ ప్రాంతంలో నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని రావాల్సిందిగా చెప్పి పంపినాడు. ఈనెల 10 తేదీన వీరిరువురు తులసిపాక చేరుకుని అక్కడ ఏడుగురి వద్ద నుండి 727.360 కేజీల గంజాయిని లార్ క్యాబిన్ కు మరియు ట్రక్ నకు మధ్య భాగంలో ఎవరికీ కనపడకుండా ఒక చాంబర్ లాగా తయారు వేసి అందులో అమర్చుకుని తిరిగి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు నిషేధిత గంజాయిని తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో శనివారం కొత్తగూడెం వన్డేన్ మరియు సిసిఎస్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.ఈ నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అట్టి రవాణాకు ఉపయోగించిన లారీను మరియు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. పట్టుబడిన ఇద్దరూ వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించరు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కొత్తగూడెం 1టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సై విజయ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

 

Views: 489
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.