యువతకు ఆదర్శం ‘కరాటే మాస్టర్ సుధాకర్’.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా : సమాజ సేవ కు యువత ముందుకు రావాలి ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం లో ప్రముఖ కరాటే మాస్టర్, సంఘ సేవకుడు నిరడీ సుధాకర్ పుట్టినరోజు రోజు కార్యక్రమం లో ‘ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర’ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుధాకర్ మాస్టర్ కి పుట్టినరోజు సందర్బంగా శాలువా పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ‘శ్రీధర్ మహేంద్ర’ మాట్లాడుతూ.. సుధాకర్ మాస్టర్ ఏంతో మందికి కరాటే శిక్షణ ఇచ్చి, అదే విదంగా ఎండాకాలం లో చలి వేంద్ర కేంద్రం ఏర్పాటు చెసి, బాట సారు లకి దాహం తీర్చి యువత కు ఆదర్శం గా నిలిచారని ప్రశంసించారు. సుధాకర్ మాస్టర్ లాగే నేటి యువత తమకు తోచిన సేవ సమాజానికి చెయడానికి ముందుకు రావాలన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ నాయకులు బోగా శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, చిద్రి రమేష్, విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List