దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
పేద ప్రజలకు దివీస్ ల్యాబరేటరి వారు చేపడుతున్న సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకొండ గ్రామంలో దివిస్ ల్యాబరేటిస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 5,36,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు, చేసిన వాటర్ ప్లాట్ ను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దివిస్ సంస్థ వారు ఈ ప్రాంత గ్రామాలలోని పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, వేములకొండ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు దీవిస్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి అనంత రెడ్డి, పాశం సత్తిరెడ్డి, కేసిరెడ్డి నీరజ వెంకటేశ్వర రెడ్డి పులిపలుపుల రాములు, ఎస్.కె రసూల్, దివిస్ సంస్థ ప్రతినిధి సాయి కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comment List