డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
మహనీయుల చరిత్రను చదవాలి మహనీయుల చరిత్ర చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది
- టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 14, న్యూస్ ఇండియా : షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఆయన చిత్ర పటానికి, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడారు ... ప్రతి ఒక్కరూ మహనీయుల చరిత్ర చదవాలని, మహనీయుల చరిత్ర వల్ల జ్ఞానం పెరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.మహిళల అభివృద్ధి, సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. అన్ని వర్గాల లో సామాజిక రుగ్మతలను రూపుమాపడాన్నారు.సామాజిక వివక్ష లేని సమాజమే నిర్మించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ అంటే ఎనలేని గుర్తింపు ఉందని ఆయన చేసిన సేవలు ఆయన పోరాటాల వల్ల అనేక అంతరాలు తొలగి పోయాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ సంస్థల అధ్యక్షుడు అంజయ్య, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, డి.ఎస్.పి సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు ,విద్యార్థిని విద్యార్థులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comment List