‘రాజీవ్ వికాసం పథకం’ పై సిబిల్ స్కోర్ మినహాయింపు.

కలెక్టరేట్లో రాజీవ్ వికాసం పథకం పై బ్యాంకర్లతో సమావేశం.

On
‘రాజీవ్ వికాసం పథకం’ పై సిబిల్ స్కోర్ మినహాయింపు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ఈ పథకం లో అర్హులైన నిరుద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్నిఅందించాలన్నారు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు తలపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించిందనీ ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించగా రూ.50వేలు మొదలుకుని రూ.4లక్షల వరకు రుణం పొందేందుకు పథకాలను ప్రభుత్వం నిర్వహించిందని ఈనెల 14వ తేదీతో దరఖాస్తు సమర్పణకు ప్రభుత్వం ఆన్లైన్లో చివరి తేదీగా నిర్ణయించిందన్నారు. జిల్లా మొత్తంలో 51,657మంది దరఖాస్తులు సమర్పించారని అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకుగాను 23,681, ఎస్సీ విభాగం లో 7,415 యూనిట్లకు 14,480, మైనార్టీ విభాగం లో 2,456 యూనిట్లకు 8,378, ఎస్టీ విభాగంలో 2,502 యూనిట్లకు 4,232, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించాలని తెలియజేశారు.రాజీవ్ యువ వికాసం పథకాన్ని నాలుగు కేటగిరీ జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యూనిట్లను మంజూరు చేసి వారికి ప్రాసీడింగ్స్ను అందచేయనున్నారని, ఈ పథకంలో మొదట నిస్ప హాయులు, వితంతువులు, ఒంటరి మహి ళలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇదివరకు ప్రభుత్వం నుంచి స్వయం ఉపాధి పథకాల రుణాలు పొందని వారికి ప్రాధాన్యతా క్రమం లో మంజూరు చేయనుందని పేర్కొన్నారు. పథకం కింద అర్హత పొందిన వారికి రెండు దఫాలుగా వారి ఖాతాల్లో నగదు జమకానుంది. తొలుత సగభాగం యూనిట్లు కొనుగోలు చేసే సమ యంలో, మిగిలిన సగభాగం యూనిట్లు కొను గోలు చేసిన తర్వాత అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, పిడి డిఆర్డిఏ జ్యోతి, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ రామాచారి, సాంఘిక సంక్షేమ శాఖ/ గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్,ఎల్ డి ఎం గోపాల్ రెడ్డి,  జిల్లా అల్ప సంఖ్య  సంక్షేమ అధికారి దేవుజా , వివిధ బ్యాoక్ అదికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-21 at 4.00.28 PM

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News