పోస్టల్ లో పొదుపు సురక్షితం.
ఆకర్షణీయమైన వడ్డీతో అధిక రాబడి. -సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎల్ వి మురళి కుమార్
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 24, న్యూస్ ఇండియా : పుట్టిన పసిబిడ్డ నుండి వృద్ధుల వరకు తపాల శాఖలో మంచి పొదుపు పథకాలు ఉన్నాయని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎల్ వి మురళి కుమార్ తెలిపారు. పోస్టల్ లో ఉన్నటువంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆకర్షణీయమైన వడ్డీ తో లబ్ధి పొందాలని పేర్కొన్నారు. పోస్టల్ లో వున్న పొదుపు పథకాలలో పొదుపు చేసిన ప్రతి పైసా సురక్షితమని చెప్పారు. ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే పోస్టల్ లో అధిక వడ్డీ లభిస్తుందని అన్నారు. ఇండియా పోస్ట్ అందించే వివిధ రకాల పోస్టల్ చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీమ్‌ల వివరాలను సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎల్ వి మురళి కుమార్ వివరించారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్(ఎస్ బి) కనీసం రూ. 500 డిపాజిట్‌తో ఓపెన్ చేయవచ్చు. సంవత్సరానికి 4శాతం వడ్డీ లభిస్తుంది. 10 సంవత్సరాల వయసు పైన ఉన్నవారు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.2 రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (ఆర్ డి): కనీసం రూ.100 నెలవారీ డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సంవత్సరానికి 6.7శాతం వడ్డీని పొందండి.మైనర్ అకౌంట్ గార్డియన్ తో అకౌంట్ తీసుకోవచ్చు.ఎన్ని ఖాతాలైన ప్రారంభించవచ్చు .3.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (టి డి): కనీసం రూ.1,000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.1 సంవత్సరం, 2 సంవత్సరాలు,3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాల పరిమితిలో టి డి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక సంవత్సరం కు 6.9 వడ్డీ, రెండు సంవత్సరాలకు 7.0 వడ్డీ, మూడు సంవత్సరాలకు 7.1 వడ్డీ, ఐదుసంవత్సరాలకు 7.5 వడ్డీ లభిస్తుంది.ఎన్ని ఖాతా లైనాప్రారంభించవచ్చు 4.పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (ఏం ఐ ఎస్): కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సంవత్సరానికి 7.4శాతం వడ్డీని పొందండి. గరిష్ట డిపాజిట్ పరిమితి సింగిల్ ఖాతాలకు రూ. 9 లక్షలు మరియు ఉమ్మడి ఖాతాలకు రూ.15 లక్షలు పెట్టు బడితో అకౌంట్ తీసుకోవచ్చు.ప్రతి నెల వడ్డీ పొందవచ్చు.5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సి ఎస్ ఎస్): కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సంవత్సరానికి 8.2శాతం వడ్డీని పొందండి. గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 30 లక్షలు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు అనువైనదని తెలిపారు.6.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పి పి ఎఫ్): కనీసం రూ.500 డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మరియు ఒక సంవత్సరం లో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. సంవత్సరానికి 7.1శాతం వడ్డీని పొందండి. ఇది 15 సంవత్సరంల కాల పరిమితి గల అకౌంట్. 7.సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్ ఎస్ ఏ): 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పథకం ఇది. ఇందులో రూ. 250 కనీస డిపాజిట్‌తో అకౌంట్ ప్రారంభించవచ్చు .సంవత్సరానికి 8.2శాతం వడ్డీని పొందండి.మరియు ఒక సంవత్సరం లో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు8.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ ఎస్ సి): కనీసం రూ. 1,000 పెట్టుబడితో అకౌంట్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 7.7శాతం వడ్డీని పొందండి.9.కిసాన్ వికాస్ పత్ర (కె వి పి): కనీసం రూ. 1,000 పెట్టుబడితో అకౌంట్ ప్రారంభించవచ్చు.సంవత్సరానికి 7.5శాతం వడ్డీని పొందండి. తొమ్మిది సంవత్సరంలఏడునెలలు (115 నెలల్లో) డబ్బు రెట్టింపు అవుతుందనితెలిపారు. కీలకప్రయోజనాలు ప్రభుత్వ మద్దతుగల భద్రత-పూర్తిగా సురక్షితం.బ్యాంకు పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్ల. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు సౌకర్యవంతమైన కాలపరిమితి ఎంపికలు.సాధారణ ఆదాయ ఎంపికలు- తక్కువ-రిస్క్ పెట్టుబడి- సులభతరమైన సేవలు అర్హత, దరఖాస్తు ఎలా అంటే ఏ భారతీయ పౌరుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు, కనీస, గరిష్ట డిపాజిట్ పరిమితులు పథకం ప్రకారం మారుతూ ఉంటాయి. పోస్టాఫీసులలో ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో తెరవవచ్చు అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్-సైజు ఫోటో సమర్పించాలి. పోస్టల్ లో బీమా పథకాలు :-తపాల శాఖలో పొదుపు పథకాలతో పాటు బీమా పథకాలు కూడా ఉన్నాయని పోస్టల్ ఎస్పీ ఎల్ వి మురళి కుమార్ తెలిపారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీ సంస్థలతో పోలిస్తే పోస్టల్ లో వున్నటు వంటితపాలా జీవిత బీమా (పి ఎల్ ఐ), గ్రామీణ తపాల జీవిత బీమా (ఆర్ పి ఎల్ ఐ) బీమా పథకాలలో తక్కువ ప్రీమియం తో ఎక్కువ బోనస్ లభిస్తుందని పేర్కొన్నారు. 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు గల వారు అర్హులని చెప్పారు. ఇలాంటి పొదుపు మరియు బీమా పథకాలను అర్హులైన వారందరూసద్వినియోగపరుచుకోవాలని పోస్టల్ ఎస్పీ కోరారు. ఇంకా పూర్తి వివరాలకోసం దగ్గర్లో గల పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాలని సూచించారు. ఇదిలావుండగా ఎంపిక చేయబడిన పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఆధార్ సేవలు, రైల్వే టికెట్ బుకింగ్ సేవలు కూడా అందించుచున్నామని వివరించారు. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కేవలం 200 రూపాయలతో ఐపిపిబి అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ అకౌంట్ సహాయంతో యాప్ ద్వారా మెరుగైన అన్ని రకాలైన ఆన్లైన్ సేవలను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమైన తపాలా శాఖ లో ఉన్నటువంటి పోస్టల్ పథకాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించి మెరుగైన సేవలు అందించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పి ఎల్.వి మురళి కుమార్ తెలిపారు.
Comment List