ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...
స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...
స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

*ఎల్బీనగర్, ఏప్రిల్ 02 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి రెడ్డి అన్నారు. రాత్రి సమయంలో బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వచ్చే రోగులకు సరిగ్గా వైద్యం అందిస్తున్నారా లేదా అని, అత్యవసర సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేరు అని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రోగుల ఆహార విషయంలో, చికిత్స ప్రక్రియలో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని అక్కడున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో వచ్చే పేషంట్ల కు ఇబ్బందులు కలగకుండా మెరుగైన చికిత్సను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మూత్రశాలలు శుభ్రపరుచుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సిస్టర్ సంధ్య తదితరులు ఉన్నారు.
Comment List