రేషన్" దందా చేస్తే జైలుకే..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్ధార్ మాచన రఘునందన్
"రేషన్" దందా చేస్తే జైలుకే
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్ధార్ మాచన రఘునందన్
నల్లగొండ జిల్లా, మార్చి 20, (

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం తో ఎవరు దందా చేసినా జైలు కు పంపడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన చింత పల్లి మండలం కుర్మేడు,వింజమూరు ల్లో చౌక దుకాణాల ను,కిరాణా దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..లబ్ది దారుల వద్ద అధిక ధరకు రేషన్ కొని అత్యధిక ధరకు కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం అమ్ముతున్నారని, వారు ఎంతటి వారైనా జైలు కు పంపడం ఖాయం అని రఘునందన్ హెచ్చరించారు.వింజమూరు లో కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.ఆయా దుకాణాల వారికి రేషన్ బియ్యం కొనవద్దని హెచ్చరించారు.రేషన్ బియ్యం గా అనుమానిచదగ్గ స్టాక్ ఉన్న ఓ ఇంటికి తాళం వేశారు.గ్రామం లో ఎవరూ రేషన్ బియ్యం అమ్మవద్దు, కొనవద్దు అని చాటింపు వేయించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు.
Comment List