ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రకు పాటు పడాలి- ఎంపీపీ బాపురం శ్రీవిద్య..!

2వ వార్డులో పలువురికి తడి చెత్త, పొడి చెత్త సేకరణ డబ్బాలు పంపిణి.

On
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రకు పాటు పడాలి- ఎంపీపీ బాపురం శ్రీవిద్య..!

- ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి - ఎంపీపీ బాపురం శ్రీవిద్య...

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి 15 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రెండవ వార్డులో మండల అధ్యక్షురాలు బాపురం శ్రీవిద్య శనివారం 2వ వార్డులో పలువురికి తడి చెత్త, పొడి చెత్త సేకరణ డబ్బాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ బాపురం శ్రీ విద్య మాట్లాడుతూ మండల ప్రజలు పరిసరాల పరిశుభ్రకు పాటు పడాలని, ప్రతి గ్రామ పంచాయతీలో నిత్యం తడి చెత్త, పొడి చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుందని, కావున గ్రామ పంచాయతీకి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఆలాగే గ్రామ పంచాయతీలోని అన్ని వార్డులలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ డబ్బాలు పంపిణి చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మండలంలోని మిగిలిన అన్ని గ్రామ పంచాయతీ లకు త్వరలోనే చెత్త సేకరణ డబ్బాలు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో సేకరించిన తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేసి పంచాయతీ పరిధిలో చేపట్టిన చెత్త సేకరణకు సహకరించాలని, ఆలాగే పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు పాటు పాడాలని, మండల ప్రజలంరూ ప్లాస్టిక్ వాడకంను పూర్తిగా తగ్గించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి జయరాం, వైసీపీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, వైసీపీ తాలూకా బూత్ కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పెద్దకడుబూరు గ్రామ సర్పంచ్ రామాంజినేయులు మరియు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు...IMG_20250316_085847

Views: 24
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News