తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ మొదలు
సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రెస్ నేత, 56 డివిజన్ కార్పొరేటర్ పైడపల్లి రోహిణి
ఖమ్మం: ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఈ సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నేత, 56 డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ లోని 90 రేషన్ షాప్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పైడపల్లి రోహిణి ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండగా వాటిని చాలా అమ్ముకుంటున్నారు. అదనంగా ఖర్చు చేసి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి అదనపు ఖర్చు లేకుండా ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ చంద్రశేఖర్, తెలంగాణ స్టేట్ ఎస్టి కోఆర్డినేర్ బిక్షపతి రాథో, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ సుజాద్ అహ్మద్, పైడిపల్లి సత్యనారాయణ, పొట్ల వీరేందర్, బిక్కసాని మురళీకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.
Comment List