గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శేరిలింగంపల్లి ( మార్చ్ 8) : న్యూస్ ఇండియా ప్రతినిధి కే.వినోద్ కుమార్, ఈ రోజు మహిళా సాధికారతకు, వారి హక్కులకు, సమాజంలో వారి పాత్రకు అంకితం చేయబడ్డ రోజు
*స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు* *మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది- -- డీన్ భరద్వాజ్*
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో జి ఎం ఎస్ డీన్ భరద్వాజ్, డీన్ ఆఫ్ అకాడమిక్స్ అశ్విన్, ప్రిన్సిపల్ సంధ్యారాణి సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అశోక్ వి గ్రాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీచర్స్ ను, ఆయా వర్కర్స్ ను, మహిళా సిబ్బందిని , పాఠశాలలో విద్యాభ్యాసం బోధించే టీచర్స్ ను సన్మానిస్తూ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీన్ భరద్వాజ్ మాట్లాడుతూ,మహిళలు మన సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. వారు లేనిదే మన సమాజం అసంపూర్ణం,చరిత్రను పరిశీలిస్తే, మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేశారు. రాజకీయాలు, విజ్ఞానం, కళలు, క్రీడలు, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.
అయినప్పటికీ, నేటికీ మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. లింగ వివక్ష, అసమానత్వం, హింస వంటి సమస్యలు మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపునిస్తూ,మహిళా సాధికారత కోసం మనం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని దాంట్లో ముఖ్యమైనవి
*విద్య, ఉపాధి ,రాజకీయ భాగస్వామ్యం, సామాజిక మార్పు మహిళల పట్ల సమాజ దృక్పథంతో మెలగాలని రావాలని మహిళలకు నాణ్యమైన విద్యను అందించడం చాలా ముఖ్యం. విద్య ద్వారానే మహిళలు తమ హక్కులను తెలుసుకుంటారు, తమ కాళ్లపై తాము నిలబడగలుగు మహిళలు శక్తివంతులే అని తెలియజేస్తూ
ఈ సందర్భంగా, మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించాలని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ ఇన్చార్జెస్ రాధిక, శ్రీలక్ష్మి, దివ్య మౌనిక, మరియు టీచర్స్ శ్రావణి, కృపారాణి, సంధ్యారాణి, అనిత, గీత, క్వాజా, సురేఖ మొదలగు టీచర్స్ పాల్గొన్నారు.
Comment List