పెద్దకడుబూరు : సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
తహసీల్దార్ గీతా ప్రియదర్శిని పై దుర్భాషలాడడం, ఫర్నిచర్, రికార్డులు ధ్వంసం చేసినందుకు వీరేష్ పై కేసు.
ఎఎస్ఐ శివరాములు వెల్లడి...
న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం / మార్చి 30 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు పొజిషన్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి తహసీల్దార్ గా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గీతా ప్రియదర్శిని తో వాగ్వివాదానికి దిగినట్లు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఎస్ఐ శిరాములు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతరం ఎఎస్ఐ శివరాములు మాట్లాడుతూ తహసీల్దార్ పై సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ కార్యాలయంలోని ఫర్నిచర్, రికార్డులు ధ్వంసం చేసి, ని అంతు చూస్తాను అని తహసీల్దార్ ను బెదిరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారి పై బెదిరింపులకు పాల్పడిన సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై 132, 324(4), 79, 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు...
Comment List