పెద్దకడుబూరు మండలం : అభివృద్దే మా ద్యేయం - ఎంపీపీ బాపురం శ్రీ విద్య ....!*
మండల కేంద్రమైన పెద్దకడుబూరులో అంగన్వాడీ భవనం నిర్మాణం, ఓహెచ్ఆర్ ట్యాంకు మరమ్మత్తులకు శ్రీకారం.
- 15 లక్షల రూపాయలు ఎంపీపీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం - ఎంపీపీ దంపతులు వెల్లడి.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి 24 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ఎస్సి కాలనీలో చాలా కాలంగా అసంపూర్తిగా నిలిచిపోయినా అంగన్వాడీ భవనం నిర్మాణానికి 5లక్షల రూపాయలతో భూమి పూజ చేశారు. అలాగే లక్ష్మీపేటలో శిదిలావస్థకు చేరుకున్న ఓహెచ్ఆర్ ట్యాంకు మరమ్మత్తులకు 10లక్షల ఖర్చుతో పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కార్యక్రమం లో ఎంపీపీ బాపురం శ్రీ విద్య మరియు వైసీపీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని ఎస్సి కాలనిలో ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనం పునఃనిర్మాణానికి 5 లక్షలు మరియు బిసి కాలనీలోని లక్ష్మిపేటలో 30 సంవత్సరాలప్పుడు నిర్మించిన ఓహెచ్ఆర్ ట్యాంకు శిదిలావస్తకు చేరుకోవడంతో, ఆ ట్యాంకు మరమ్మత్తులకు గాను 10లక్షల రూపాయలు ఎంపీపీ నిధులతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే మండలంలోని గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేసి మండలాన్ని అభివృద్ధి చేయడమే మా ద్యేయమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తాలుక బూత్ కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురామ్, సర్పంచ్ రామాంజినేయులు, ఎంపీడీఓ నాగరాజు స్వామి, ఈఓఆర్డి జయరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎఈ సాయి కుమార్, వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, అనిల్, ఈరన్న, దస్తగిరి, శాంతిమూర్తి మరియు దదితరులు పాల్గొన్నారు...
Comment List