సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు...

On
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు...

ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ 
తెలంగాణ అధ్యక్షులు
మాచన రఘునందన్..

IMG-20250311-WA0584
భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు చేసిన: ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 11 న్యూస్ ఇండియా ప్రతినిధి: భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలని కోరుతూ.. సాయి నాథునికి ప్రత్యెక పూజలు చేసినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ చెప్పారు. మంగళవారం ఆయన సిపిఎస్ రద్దు కోసం చింతపల్లి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి 23న ఢిల్లీ లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం కార్యక్రమం ఉందని, అది విజయవంతం చేయాలని సాయి నాధునికి ప్రార్థన చేసినట్టు చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప..పెన్షన్ తో ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు "న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు మహా ప్రభో అని దీనంగా దైవాన్ని అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. పాలకులకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పధకం ను పునరుద్దరించేలా బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు పూజలు చేసినట్టు రఘునందన్ వెల్లడించారు. ఆలయం నిర్వాహకులు రఘునందన్ ను సాయి చిత్రపటంతో సత్కరించి, అభీష్టం నెరవేరాలని ఆశీర్వదించారు.

Read More అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే: దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం. ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 11, న్యూస్ ఇండియా : ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం అని, సమానత్వం, న్యాయం మరియు సామాజిక...
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
*తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే: దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
సంగారెడ్డి లో 'భారీ వర్షం'
యువతకు ఆదర్శం ‘కరాటే మాస్టర్ సుధాకర్’.
ప్రతి పేదవాడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..