మాచన" కు అమెరికా ఆహ్వానం..
టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ కు అరుదైన గౌరవం..
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ కు అరుదైన గౌరవం..

రంగారెడ్డి జిల్లా, మార్చి 25, (న్యూస్ ఇండియా ప్రతినిధి): "మిస్టర్ మాచన రఘునందన్ ప్లీజ్ కమ్ టు యూ.ఎస్.ఏ" అని అమెరికా కు చెందిన వైద్య ఆరోగ్య మాస పత్రిక పల్మనరీ మెడిసిన్ తనను ఓ సదస్సు లో పాల్గొనేందుకు ఆహ్వానించిందనీ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ తెలిపారు. మంగళవారం నాడు ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 11 గంటలకు అమెరికా కు చెందిన పల్మనరీ మెడిసిన్ వారు ఫోన్ చేసినట్టు రఘునందన్ వివరించారు. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ గా మాచన రఘునందన్ పని చేస్తున్నారు. 22 ఏళ్లుగా.. "మాచన" పొగాకు నియంత్రణ కు విశేష కృషి చేస్తున్నారు. కాగా.. వరల్డ్ టి.బీ డే సందర్భంగా, కొత్త ఢిల్లీ కి చెందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) వారు సైతం.. రఘునందన్ ను పొగాకు నియంత్రణ సదస్సు కు ఆహ్వానించారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు పొగాకు, ధూమపానం అలవాటు, తన ఇద్దరు ఆప్త మిత్రుల ను బలి తీసుకుందని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఓ మిత్రుడికిచ్చిన వాక్ దానం వల్ల రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కు అలుపెరుగని కృషి చేస్తున్నట్టు రఘునందన్ వివరించారు. 2020 లో జర్మనీ, 2022 లో దక్షిణ ఆఫ్రికా, 2023, 24 లో ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందాయని రఘునందన్ తెలిపారు. తాజాగా పల్మనరీ మెడిసిన్ మాస పత్రిక వారి వైద్య విజ్ఞాన సదస్సు లో పాల్గొనేందుకు ఏప్రిల్ నెల లో అమెరికా రావాలని కబురు అందిందని "మాచన" చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఎందరో కాన్సర్, టి.బీ వంటి జబ్బు లకు బలి అవుతున్నారని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comment List