థాంక్యూ ఆర్టీసీ : "మాచన"
స్మోకర్ డ్రైవర్ పై చర్య కు ఆర్టీసి హామి...
ఏ వ్యాపార సంస్థ కు ఐనా వినియోగదారుడే వి.ఐ.పి అని, వినియోగదారులతో మర్యాదగా మాట్లాడటం అత్యంత కీలకమైన అంశం అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
థాంక్యూ ఆర్టీసీ : "మాచన"
స్మోకర్ డ్రైవర్ పై చర్య కు ఆర్టీసి హామి...
బస్ స్టాండ్ ఇకపై"నో స్మోకింగ్" జోన్..?!
రంగారెడ్డి జిల్లా, మార్చి 20, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఏ వ్యాపార సంస్థ కు ఐనా వినియోగదారుడే వి.ఐ.పి అని, వినియోగదారులతో మర్యాదగా మాట్లాడటం అత్యంత కీలకమైన అంశం అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.

.jpg)
బుధవారం నాడు హైదరాబాద్ - 1 ఆర్టీసీ డిపో బస్ డ్రైవర్ పొగ తాగుతూ. బస్ నడిపిన ఘటన పై.. మాచన రఘునందన్ ఎక్స్ ద్వార, వాట్స్ అప్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన ఉదంతం తెలిసిందే.. కాగా దీనికి ట్వీటర్ లో వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు సారి.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని పేర్కొంటూ.. రఘునందన్ కు క్షమాపణ చెప్పారు. ఇది ఇలా వుండగా.. గురువారం నాడు, ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్.ఎం.. డ్రైవర్ పై చర్య తీసుకుంటున్నాము అని వాట్స్ అప్ ద్వారా తెలిపారు. డ్యూటీ లో ఉండగా సిగరెట్ తాగడమే గాక.. దాన్ని ప్రశ్నించిన ప్రయాణికుడి పట్ల దురుసుగా.. కర్కశంగా వ్యవహరిoచిన డ్రైవర్ పై చర్య కు తీసుకోవడం పట్ల రఘునందన్ ఆర్టీసీ కి ధన్యవాదాలు తెలిపారు. బస్సుల్లో.. బస్ స్టాండ్ ల లో కూడా ఆర్టీసీ సిబ్బంది సిగరెట్, బీడీ తాగకుండా పొగాకు ఉత్పత్తులను వాడి బస్సులో నే ఉమ్మి .. అపరిశుభ్రం చేయకుండా నియమ నిబంధనల ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రఘునందన్ ఆర్టీసీ కి సూచించారు. అంతే గాక బస్ స్టాండ్ లను సాధ్యం అయినంత మటుకు "నో స్మోకింగ్" జొన్స్ గా చేయాలని మాచన రఘునందన్ ఆర్టీసీ ని కోరారు.
Comment List