నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి చేయాలని పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (NISD) సౌజన్యంతో నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెంలో మాదకద్రవ్యాల నియంత్రణపై నాటక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశంలో డ్రగ్ దుర్వినియోగం ఒక పెరుగుతున్న సమస్యగా మారిందనీ, ఇది వ్యక్తులకే కాకుండా కుటుంబాలు మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందనీ, యువత ముఖ్యంగా డ్రగ్స్ వాడటం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటూ, మానసిక స్థిరత్వం కోల్పోవడమే కాకుండా, నేరాల పెరుగుదలకు కూడా కారణమవుతున్నారని చెప్పారు. వీటికి దూరంగా ఉన్నప్పుడే మంచి పౌరులుగా ఎదుగుతారని, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుక్ ఇమ్రాన్ ప్రదర్శన చేయించడం జరిగింది.
Comment List