భూభారతి చట్టంతో అధికారాల వికేంద్రీకరణ.
పారదర్శకత, జవాబుదరితనమే భూ భారతి చట్టo ముఖ్య ఉద్దేశం. రైతులకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది భూభారతి చట్టం. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : భూ భారతి ( భూమి హక్కుల చట్టం- 2025) ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. పటాన్ చేరు మండలం కేంద్రంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్, రామచంద్రాపురం లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్, అమీన్పూర్ మండలం సంబంధించి బాలాజీ కన్వెన్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలెక్టర్ పాల్గొన్నారు. పఠాన్ చెరువు అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూభారతి- నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టంతో అధికారుల వికేంద్రీకరణ జరిగిందని, పారదర్శకత జవాబుదారితనమే
ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు. భూసమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్ ఓ ఆర్) చట్టం - 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలన్నారు. రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చరాని ,
భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది అన్నారు. భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం భూ భారతి చట్టంతోపాటు, నియమ నిబంధనలు ఒకేసారి తయారు చేసిందని, రికార్డుల నిర్వహణ, సవరణ, రిజిస్ట్రేషన్ ,మ్యుటేషన్, సాదా బైనామ ,పౌతి,వంటి అంశాలను కలెక్టర్ వివరించారు. ధరణిలోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన భూ భారతి చట్టం పై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు, ప్రతి ఒక్కరికీ నూతన చట్టం భూభారతి, దానిలోని అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని కలెక్టర్ అన్నారు. ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతకు ముందు ఉన్న చట్టం లో కోల్పోయిన హక్కులు, కొత్త చట్టంలో ఎలాంటి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం మండలాల తాసిల్దారులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, రైతులు రైతు సంఘ నాయకులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List