కలహాలొద్దు.. కలిసి ముందుకు వెళ్దాం.
ఐక్యమత్యంగా నడిస్తేనే అందరికీ సమన్యాయం.
జీవోఏంఎస్ 98/1964 ప్రకారం ముందుకు వెళ్దాం. ప్రతి ఒకరికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ సర్కార్ కృషి. ఫైవ్ మెన్ కమిటీ న్యాయ బద్ధంగా మత్స్యకారులందరికి న్యాయం చేస్తుందని విశ్వాసం. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి మత్స్యకార సంఘ నాయకులతో కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ కలిసి ‘వేం నరేందర్ రెడ్డి’ ని కలిసిన. మత్స్యకారులు సభ్యత్వాల విషయంలో కలహాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు పోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలు బీసీ డి నుంచి బీసీ ఎ మరియు రాజకీయ, ఉద్యోగ, ఆర్థిక పరమైన విషయాలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని శనివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ,వివిధ ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి నీలం మధు కలిశారు.
ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన వేం నరేందర్ రెడ్డి గారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ
మత్స్యకారులకు సభ్యత్వ నమోదు లో పలు సామాజిక వర్గాల మధ్య ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందించారు. కలహాలు లేకుండా కలిసి ముందుకు సాగితేనే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో మత్స్య సంపద పెరుగుదలకు లోటు లేదని ప్రతిఒక్కరు భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకుందామన్నారు. జీవో ఏం ఎస్ 98/1964 ప్రకారం ముందుకు వెళ్తే సమస్య పరిష్కారానికి మార్గం సులువుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక వర్గాల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలతోనే సమస్య ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సభ్యత్వంలో ఎదురవుతున్న ఇబ్బందుల వలన హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన ఫైవ్ మెన్ కమిటీ ముందు ప్రతి ఒక్కరు బేధాభిప్రాయాలు లేకుండా తమ వాదనను వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులందరికీ న్యాయం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. త్వరలో మత్స్యకార సామాజిక వర్గాలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి మన దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. మేము ముందుండి మన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని నాయకులు ప్రకటించారు. ఐక్యమత్యంతో ముందుకు సాగుతేనే రాజకీయ,ఆర్థిక అభ్యున్నతి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు సంయమనం పాటించి మన అందరి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి నారాయణ, చొప్పరి శంకర్, డిఎల్ పాండు, నీలకంఠం, ప్రభాకర్, గుండ్లపల్లి శ్రీనివాస్, బలరామ్, రమేష్, మద్దెల సంతోష్,గొడుగు శ్రీను, సురేందర్, లక్ష్మణ్, యాదగిరి, శివ, సుంకరబోయిన మహేష్, సతీష్, అశోక్, మాణిక్యరావ్, నారబోయిన శ్రీనివాస్, రాములు, ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List