ఘనంగా మమత వైద్య దంత నర్సింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే.
హాజరైన మాజీ మంత్రి పువ్వాడ.
ఖమ్మం మమత వైద్య దంత నర్సింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే ఈరోజు మమత క్యాంపస్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాళోజి నారాయణరావు వైద్య యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ పీవీ నందకుమార్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు హాజరయ్యారు. మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ మమత వైద్య సంస్థలు స్థాపించి ఎంతో మందిని డాక్టర్లను చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ఛాన్సులర్ పీవీ నంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో మమత సంస్థలు నెలకొల్పి ఎంతో మంది వైద్య విద్యార్థులను అందింస్తునందుకు అభినందనలు తెలిపారు. పువ్వాడ ఉదయ్ కుమార్, జయశ్రీ గార్ల కుమారుడు నరేన్ రాజ్ ఈరోజు గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే లో 360 మంది వైద్య విద్యార్థులు 190 మంది దంత విద్యార్థులు 100 మంది నర్సింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమత ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, డైరెక్టర్లు పువ్వాడ నయన్ రాజ్, నరేన్ రాజ్, ప్రిన్సిపాల్స్ అనురాధ, వెంకటేశ్వర రావు, కృష్ణ వైష్ణవి పాల్గొన్నారు.
Comment List