ధాన్యం సేకరణ ఓ యజ్ఞం..
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి ఒక్కరూ..మిల్లర్లు, వడ్ల సేకరణ కేంద్రాల వారు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన చింత పల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్తున్న లారీల ను కొన్ని మిల్లు ల వద్ద త్వరగా డాక్టర్ దిగుమతి చేసుకోవటం లేదు అని ఫిర్యాదు లు, ఆరోపణలు వస్తున్నాయని ఇలా ఇష్టా రాజ్యాంగా.. వ్యవహరించే మిల్లు ల కు షో కాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. లారీల్లో రవాణా అవుతున్న సరకు ఎక్కడిది , ఎక్కడికి వెళ్తుంది, సరైన పత్రాలు ఉన్నాయా..అన్న కోణంలో ట్రక్ షీట్ ను తనిఖీ చేస్తున్నట్టు రఘునందన్ వివరించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల లో రైతుల వద్ద హమాలీలు అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రఘునందన్ హెచ్చరించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల వివరాల రికార్డుల ను జాగ్రత్త పరచాలని రఘునందన్ స్పష్టం చేశారు. నసర్ల పల్లి లో వెంకట సాయి రైస్ మిల్లు లో ధాన్యం నిల్వ ల ను ఆర్ ఐ కే వెంకటేశ్ తో కలసి తనిఖీ చేశారు.ఆ మిల్లుకు ధాన్యం కేటాయింపు కోసం ప్రతి పాదన పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు రఘునందన్ చెప్పారు
Comment List