ఆపరేషన్ చేయూత ద్వారా 64 మంది మావోయిస్టుల లొంగుబాటు 

మల్టీజోన్ -1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు 

On
ఆపరేషన్ చేయూత ద్వారా 64 మంది మావోయిస్టుల లొంగుబాటు 

48 మంది పురుషులు, 16 మంది మహిళ మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో) మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై IMG20250315122411  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు  81 బి ఎన్, 141 బి ఎన్, సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాసి ప్రజలు అభివృద్ధి సంక్షేమ కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు "ఆపరేషన్ చేయూత " ద్వారా 64 మంది మావోయిస్టు సభ్యులు మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ముందు లొంగి పోయారు. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల  వివరాలను ఐజిపి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాకు ఆకర్షితులై, వివిధ క్యాడర్ల ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు  వివిధ కేడర్ల నుంచి 122మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారన్నారు. డివిసిఎం-1, ఏసిఏంమెస్ -4, పార్టీ సభ్యులు14 మంది, పీసీసీఎంఎస్-2, మిలిటెంట్ సభ్యులు 44 మంది, లొంగిపోయినట్టుగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు  ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదును ఐజి అందజేశారు. ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ సంక్షేమ పథకాలను కూడా వారికి అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి చతిస్గడ్ రాష్ట్రం  సుకుమా, బీజాపూర్ చెందినవారు కాగా తెలంగాణ పోలీసుల పై ఉన్న నమ్మకంతో ఇక్కడ పోలీసులను సంప్రదించి తెలంగాణలో లొంగిపోయారని అన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం  తగ్గిపోయింది అన్నారు. ఇంకా 90 నుంచి 100  మంది కన్నా ఎక్కువ మంది మావోయిస్టులు  ఉండకపోవచ్చు అని అన్నారు. మిగతా మావోయిస్టు కూడా   అజ్ఞాతవాసాన్ని వీడి జనజీవన స్రవంతిలో రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఏఎస్పీ విక్రం సింగ్, సిఆర్పిఎఫ్ రితేష్ ఠాకూర్, ప్రతిమ,రాజేష్, డీఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Views: 80
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 17, న్యూస్ ఇండియా : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్  క్రాంతి...
'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.
ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు .
అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.