ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..

తెలంగాణ మాల స్టూడెంట్ జెఏసి, మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్...

On
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..

తెలంగాణ మాల స్టూడెంట్ జెఏసి, మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్..

రంగారెడ్డి జిల్లా మార్చి 5 న్యూస్ ఇండియా ప్రతినిధి:- రోస్టర్ పాయింట్ విధానం వల్ల, ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం వీటిపైన పునరాలోచించాలని తెలంగాణ మాల స్టూడెంట్ జెఏసి, మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన షమీమ్ అక్తర్ రిపోరర్ట్ 1, 2, 3 వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రోస్టర్ విధానం వల్ల 22 వ రోస్టర్ పాయింట్ పెట్టడం వల్ల 22 పోస్టులు ఉంటే ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, దాని వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఉద్యోగ రంగంలోనే కాకుండా మెడికల్, గ్రూప్ 1, గ్రూప్ 2 లలో కాకుండా ప్రమోషన్ లలో కూడా 22 రోస్టర్ పాయింట్ తీసుకునే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్లను  1, 2 లుగానే విభజించి మాల మాల అనుబంధంగా,  మాదిగ మాదిగ అనుబంధా కులాలుగా మాత్రమే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణలో విభజించిన గ్రూపులలో తప్పులు తడకగా ఉన్నాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు చెప్పిన లేటెస్ట్ లెక్కల ప్రకారం గా వర్గీకరణ చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం 52 కులాలలో ఎవరు వెనుక బడ్డారో వాళ్లకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పిందని గుర్తు చేశారు. గడిచిన 30 సంవత్సరాలలో ప్రభుత్వాలు ప్రకటించిన అన్ని పథకాలలో మాదిగ సామాజిక వర్గం మాత్రమే లబ్ది పొందిందని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం మాలలకు మరో మూడు శాతం రిజర్వేషన్ పెంచి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లనే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మాలలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే రేపు జరిగే స్థానిక ఎన్నికలలో కూడా బుద్ధి చెప్పడానికి మాలలందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

IMG_20250305_21582969
తెలంగాణ మాల స్టూడెంట్ జెఏసి, మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్..
Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం. ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 11, న్యూస్ ఇండియా : ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం అని, సమానత్వం, న్యాయం మరియు సామాజిక...
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
*తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే: దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
సంగారెడ్డి లో 'భారీ వర్షం'
యువతకు ఆదర్శం ‘కరాటే మాస్టర్ సుధాకర్’.
ప్రతి పేదవాడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..