కార్పొరేషన్ ఏర్పాటుతో సీపీఐ సంబరాలు
సిపిఐ ఆఫీస్ వద్ద భారీ సంబరాలు
పాల్గొన్న జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి5:కార్పొరేషన్ ఏర్పడడంతో సిపిఐ కార్యకర్తలు ఆదివారం సిపిఐ ఆఫీస్ వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా మాట్లాడుతూ... శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెంలోని 36 వార్డులు, పాల్వంచలోని 24 వార్డులు, సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, సుజాతనగర్, కోమటపల్లి, నర్సింగ్ సాగర్, మంగపేట గ్రామపంచాయతీలతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు . త్వరలో లక్ష్మీదేవిపల్లి,చుంచుపల్లి మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలు కూడా కలిపే అవకాశం ఉందన్నారు . కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కృషితోనే కార్పొరేషన్ ఏర్పడిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల ఏడో తారీఖున కొత్తగూడెం నియోజవర్గంలో ప్రజలతో సంబరాల కార్యక్రమం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సాంబశివరావు హయాంలోనే ఎయిర్ పోర్ట్ కూడా ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల అధ్యక్షులు వాసిరెడ్డి మురళి, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, శ్రీనివాస్, లక్ష్మి, భాస్కర్, రమేష్, యాకూబ్, పిడుగు, చారి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List