సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
సేవా కార్యక్రమంలో సోనుసూద్ ఫ్యాన్సు మరియు ఎస్.కె సత్తార్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 3: సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ లో శుక్రవారం యాచకులకు దుప్పట్ల పంపిణీ చేశారు. సల్లం బ్రదర్స్ అయినా సల్లం చంగయ్య, సల్లం లక్ష్మీనారాయణ, సల్లం బాలరాజు, సల్లం శంకర్, వారి తల్లిదండ్రులైన బాలయ్య మల్లమ్మ జ్ఞాపకార్ధంగా గత పది సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమంలో, అనాధ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను చాటుతున్నారు . సల్లం కుటుంబంలోని రాజనర్స్ ఆమె జ్ఞాపకార్థం నూతన సంవత్సర రోజున 40 వేల ఖర్చుతో పాల్వంచ పెద్దమ్మ గుడి సన్నిధిలో వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సల్లం బ్రదర్స్ తెలిపారు. ప్రముఖ హీరో సోనుసూద్ ఫ్యాన్సు వీరాభిమాని అయిన ఎస్.కె సత్తార్ తో కలిసి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ తమ రియల్ హీరో సోనుసూద్ సినిమా ఫథ్ సూపర్ హిట్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ ప్రసాద్, అహ్మద్ పాషా, యాకూబ్, శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List