సాయుధ పోరాట యోధురాలు కమలాదేవి
మహిళాలోకానికి ఆదర్శం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 1 : తెలంగాణా సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన ఆరుట్ల కమళాదేవి మహిళాలోకానికి, నేటితరం కమ్యూనిస్టులకు ఆదర్శమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ శాసనసభ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా సమాఖ్య మాజీ నాయకురాలు ఆరుట్ల కమళాదేవి 24వ వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1952 తొలి ఎన్నికలలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచారని, వరుసగా 1971 వరకు ఆలేరు నుండి శాసనసభ్యులుగా ప్రజాగళం విప్పారన్నారు. 1964 పార్టీ చీలిక సందర్భంగా సీపీఐ శాసనసభా పక్ష నాయకురాలుగా బాధ్యత నిర్వహించారని,2001 జనవరి 1 న తుదిశ్వాస విడిచారని తెలిపారు.ఆమెను ఆదర్శనంగా తీసుకొని ప్రజాపోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు నెరేళ్ల రమేష్, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి.సత్యనారాయణ చారి, గుత్తుల శ్రీనివాస్, మిరియాల రాము తదితరులు పాల్గొన్నారు.
Comment List