సర్కారీ దావఖానాలో శాస్త్ర చికిత్స విజయవంతం 

స్పిల్ట్ స్కిన్ గ్రాఫ్ట్ పద్ధతిలో అరుదైన శాస్త్ర చికిత్స

On
సర్కారీ దావఖానాలో శాస్త్ర చికిత్స విజయవంతం 

IMG-20241228-WA1451కొత్తగూడెం(న్యూస్ఇండియా నరేష్) డిసెంబర్ 28: కొత్తగూడెం సర్కారీ దావఖానాలొ శనివారం స్పిల్ట్ స్కిన్ గ్రాఫ్ట్ పద్ధతిలో అరుదైన శాస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. కల్లూరు చెందిన సత్యనారాయణ (75) వ్యక్తికి షుగర్ వ్యాధితో బాధపడుతు కాలుకు గాయమై తొలగించే స్థితిలో ఉండగా, ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడంతో వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ దావఖానలోనీ వైద్యులను సంప్రదించగా ,గత 30 రోజుల నుంచి పేషెంట్ ని పరిశీలనలో ఉంచుకొని, అనంతరం శనివారం కుడికాలు తొడ భాగం నుంచి సరిపడు చర్మాన్ని తీసి గాయమైన ఎడమ పాదం పైన అమర్చి శాస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ శాస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ,హెచ్ఓడి,డాక్టర్ రాంప్రకాష్ అసిస్టెంట్ ప్రొఫెసర్,డాక్టర్ విజయకుమార్ సీనియర్ ప్రెసిడెంట్ సర్జరీ, అనిస్తిస్య రమేష్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Views: 373
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News