పెద్దరాయుడుని వెంటనే అరెస్ట్ చేయాలి

జర్నలిస్టుల పై దాడి హేయమైన చర్య 

On
పెద్దరాయుడుని వెంటనే అరెస్ట్ చేయాలి

అమరవీరుల స్తూపం వద్ద కలం కార్మికుల నిరసన కార్యక్రమం 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)డిసెంబర్ 12: విIMG-20241211-WA0939ధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేయడం విచారకరమని ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కొత్తగూడెం బస్టాండ్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పత్రికేయులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వార్తల సేకరణ నిమిత్తం జర్నలిస్టులు విధుల్లో ఉంటే మోహన్ బాబు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ఎవరైనా దాడికి దిగాలంటే భయపడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పాలకులు గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యూనియన్ నాయకులు దుద్దుకూరి రామారావు, కల్లోజి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, డి, వెంకటేశ్వర్లు, కాగితపు వెంకటేశ్వర్లు, జాన్సన్ డేవిడ్, జునుమాల రమేష్, శాసంన్, రెజ్వ, ఈశ్వర్, రవీందర్, రాజ్ కుమార్, కొట్టి నవీన్, లక్ష్మణ్, నరసింహ, సురేష్, సుధాకర్, సీమకుర్తి రామకృష్ణ, అఫ్జల్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 214
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News