నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు

On
నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు

భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి చేయాలని  నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ శ్రీ వి విజయరాంకుమార్ గారు మరియు రఘునాథపాలెం సి ఐ మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ గారు సంయుక్తంగా పిలుపునిచ్చారు.  

నేషనల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (NISD) సౌజన్యంతో నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం  ఆధ్వర్యంలో  నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించబడింది.  ఈ కార్యక్రమానికి   నెహ్రు యువ కేంద్ర జిల్లా ప్రోగ్రాం అధికారి  కమరతపు భానుచందర్ అధ్యక్షత వహించగా  ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐ ఉస్మాన్ షరీఫ్ గారు మాట్లాడుతూ భారతదేశంలో డ్రగ్ దుర్వినియోగం ఒక పెరుగుతున్న సమస్యగా మారిందనీ, ఇది వ్యక్తులకే కాకుండా కుటుంబాలు మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందనీ, యువత ముఖ్యంగా డ్రగ్స్ వాడటం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటూ, మానసిక స్థిరత్వం కోల్పోవడమే కాకుండా,  నేరాల పెరుగుదలకు కూడా కారణమవుతున్నారని చెప్పారు. వీటికి దూరంగా ఉన్నప్పుడే మంచి పౌరులుగా ఎదుగుతారని పిలుపునిచ్చారు.

నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ విజయ రామ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా గంజాయి మత్తులో పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్షణిక  ఆనందం కోసం నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని, ఒకసారి అలవాటైతే అది వ్యసనంగా మారుతుందని మత్తుకు బానిసలు కావద్దని యువతకు సూచించారు మరియు పిపిటి ప్రెజెంటేషన్ తో యువత కి మాదక ద్రవ్యాలు తీసుకుంటే యువత మరియు విద్యార్థుల జీవితంలో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వివరించడం జరిగింది. తమ చుట్టూ పక్కల ఎవ్వరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనిపిస్తే డైల్ 100 నెంబర్ మరియు హెల్ప్ లైన్ నంబర్ 1908 కి తెల్పవల్సిందిగా యువత ను  కోరారు. గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కఠినంగా హెచ్చరించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేసి కార్యక్రమం లో పాల్గొన్న యువతతో అధికారులు మత్తు పదార్థాలు వాడమని ప్రతిజ్ఞ చేపించారు.

ఈ కార్యక్రమానికి సహకరించినందుకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర రావు గారికి మరియు కళాశాల యాజమాన్యానికి నెహ్రూ యువ కేంద్ర కృతజ్ఞతలు తెలిపింది.

Read More మర్రి"తో "మాచన" అనుభందం...

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News