ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!
బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు ..ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ చరిత్రను తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పలువురు ఆకాంక్షించారు.
ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!
జ్ఞానం స్థిరత్వాన్ని అందిస్తుంది...! స్థిరత్వం విజయానికి దారితీస్తుంది...!!"
ఛత్రపతి శివాజీ మహారాజ్...
ఎల్బీనగర్, ఫిబ్రవరి 19 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హస్తినాపురం సిగ్నల్ వద్ద నుంచి బి.ఎన్.రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా వరకు *శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్* జయంతిని పురస్కరించుకొని శ్రీ ఛత్రపతి శివాజీ క్రాంతి సాంగ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కార్యక్రమంలో బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు ..ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ చరిత్రను తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పలువురు ఆకాంక్షించారు. దేశం కోసం, ధర్మం కోసం, ఛత్రపతి శివాజీ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే రామాయణం, మహాభారతం, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలను తెలియజేయాలని అన్నారు. అప్పుడే ధర్మం, దేశం అలాగే స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీళ్ల అంజన్ కుమార్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, శ్రీ చత్రపతి శివాజీ క్రాంతి సాంగ్ సభ్యులు చిన్న యాదవ్, వినీల్, భార్గవ్, పార్టీ బి.యన్.రెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీధర్ రావు, కాంతారావు, రవిశంకర్, రాజేష్, గోపి, విజయ్, ఉమాశంకర్, శ్రీనివాసరెడ్డి, కిషోర్ కుమార్, దుర్గాప్రసాద్, తులసి, యోచన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comment List