బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నవంబర్ 12వ తేదీన బీఎస్పీ లో జాయిన్ అయింది మొదలు ప్రతి సంవత్సరం జిల్లా అధ్యక్ష హోదాలో 2020 మరియు 2021వ సంవత్సరంలో నాకు నిర్దేశించిన జన కళ్యాణ్ దివస్ డబ్బులను అందజేయడం జరిగింది.2022 మరియు 2023 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి నిర్దేశించిన డబ్బులను అందజేయడం జరిగింది.2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ నుండి పోటీ చేయుటకు అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల ఇచ్చిన జన కళ్యాణ్ దివస్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా నాకు ఐదు లక్షలు ప్రతి అసెంబ్లీకి లక్ష చొప్పున ఐదు లక్షలు మొత్తం కలిపి 10 లక్షల రూపాయలను లక్ష్యంగా విధించినారు కానీ అట్టి లక్ష్యాన్ని నేను అందజేయలేక పోతున్నందుకు చింతిస్తూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని అ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ కు పంపినట్టు తెలిపారు.ఇన్ని రోజులు బీఎస్పీలో తనకు సహకరించిన నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.కామేష్ తో పాటు జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ రావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,సోను,బన్ను తదితరులు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు.
Comment List