దాహార్తిని తీర్చండి
చాలా గ్రామాలలో మిషన్ భగీరథ నల్లాలు పైప్ లైన్లు లేవు
ట్యాంకర్లతో నీటిని సరపర చేయాలని కోరుతున్నాం
ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చండి ఇంకా చాలా గ్రామాలలో మిషన్ భగీరథ నల్లాలు పైప్ లైన్లు లేవు ఇంకా కొన్ని తండాలలో చేతిపంపు బోరింగ్ నీళ్లతోనే దాహార్తిని తీర్చుకుంటున్న ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం చేతిపంపు బోరింగ్ లను నిరుపయోగంగా ఉన్న బోరింగ్ లను గుర్తించి రిపేర్ చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుకుంటున్నాం ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు లేవు...కరవు వచ్చేస్తోంది.... పేద ప్రజలకి తండావాసులకి కష్టాలు వస్తాయి ఎలా...? తాగు నీరు ఎలా...? అని ప్రభుత్వాలు ఎండకాలం రాగానే...ఇలాంటి జపాలే చేస్తుంటాయి. కానీ, ఉన్న నీరును మాత్రం గాలికొదిలేస్తున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులతో వర్షాలు కురవక...కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవిస్తుంది. మరోవైపు నిండుకుండల్లాంటి చెరువు కుంటలు నదులు...నిర్వహణ లోపం కారణంగా ఖాళీ అవుతున్నాయి. అందుకు ఉదాహరణే... భారీ వర్షాలకు ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతుంది. ఐతే, ఇది కొత్తేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాజెక్టుల్లో... డ్యాంల గేట్లు కొట్టుకుపోయిన ఘటనలు...గత కొన్నేళ్లల్లో మనం అనేకం చూశాం. మరి, ఈ సమస్యకు పరిష్కారమే లేదా...? గేట్లు కొట్టుకుపోయి విలువైన నీరు వృథా అయితే ఎలా..? నిర్వహణ లోపమే కారణమా...? నిధులతో కొత్త ప్రాజెక్టులు కట్టాలా...ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవలా..? కొత్త ప్రాజెక్టులు ఏమో కానీ ఉన్న నీరుని వృధా చేయకుండా గ్రామాలలో మున్సిపాలిటీలలో స్లమ్ ఏరియాలలో మంచినీటి ట్యాంకర్లతో నీటిని సరపర చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మురికి నీళ్ళు కుంటలలో చెరువులలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్నాం .
మీ అమ్మ ఫౌండేషన్
తెలంగాణ వ్యవస్థాపకుడు మంతెన మణికుమార్
Comment List