ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం
ముఖ్య అతిథులుగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ గుండా శ్రీనివాస్
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) ఫిబ్రవరి10: కొత్తగూడెం సింగరేణి హై స్కూల్ 49వ వార్షికోత్సవని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ గుండా శ్రీనివాస్ ,విశిష్ట అతిథిగా చలపతిరావు రావు (డిస్టిక్ సైన్స్ ఆఫీసర్), సునీల్ కుమార్ (పీఎం పర్సనల్ & కరస్పాండెంట్ ఎస్సిహెచ్ఎస్)లు జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొత్తగూడెం సింగరేణి హై స్కూల్ మొత్తం 1163 మంది విద్యార్థులకు, 36 మంది ఉపాధ్యాయులు, 14 మంది బోధ నేతర సిబ్బంది ఉన్నారని, విద్య, వైజ్ఞానిక, క్రీడలు, కళా రంగాలలో విద్యార్థులకు మంచి చైతన్యవంతులుగా తీర్చిది దిగుతున్నారని అన్నారు. గత సంవత్సరం పదో తరగతిలో 83 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు.అత్యధిక మార్కులు సాధించిందన విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు.సింగరేణి హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాయి సుజాత, ఇన్చార్జ్ డి.పూల్ సింగ్, శివదర్శనీ, మల్లేశ్వరి,నాగమణి తదితరులు పాల్గొన్నారు.
.
Comment List