పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..
పెట్రోల్ బంకుల్లో టాయ్లెట్ లు శుభ్రంగా ఉండాలి
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్
రంగారెడ్ది జిల్లా, ఫిబ్రవరి 09 (న్యూస్ ఇండియా ప్రతినిధి):-

పెట్రోల్ బంకు లు వినియోగదారుల ఆదరణ పొందేలా నిర్వహణ ఉండాలని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.ఆదివారం నాడు ఆయన సాగర్ రోడ్డు లో చింతపల్లి లో ఉన్న పలు పెట్రోల్ బంకు లను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొన్ని పెట్రోల్ బంకు ల్లో మరుగు దొడ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించారు. ఏవో కారణాలు చెప్తూ..టాయిలెట్స్ ను సరిగా మెయింటైన్ చేయడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయాన్నారు.
పెట్రోల్ బంకు లో గనక మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేకపోతే చమురు సంస్థలు జరిమాన విధించే అవకాశం ఉందని రఘునందన్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నో స్టాక్ బోర్డు పెట్టవద్దని పెట్రోల్ బంకు యాజమాన్యాలకు రఘునందన్ సూచించారు. నిల్వలు ఐపోక ముందే స్టాక్ తెప్పించాలన్నారు.
Comment List