సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్

On
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి.

రెండు చేతులు జోడించి .ఓటు అడిగే వాళ్ళను చూసి ఉంటారు. లేదా మరేదైనా ఆశించి రెండు చేతుల తో దండం పెట్టడం చూస్తాo. కానీ ఓ వ్యక్తి, తన రెండు చేతులు జోడించి,సార్ దయచేసి స్మోకింగ్ మానేయండి అంటూ అర్ధించడం నిస్వార్థం గా అడగటం అరుదు.

సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి.
"మాచన" అభ్యర్థన

రెండు చేతులు జోడించి .ఓటు అడిగే వాళ్ళను చూసి ఉంటారు. లేదా మరేదైనా ఆశించి రెండు చేతుల తో దండం పెట్టడం చూస్తాo. కానీ ఓ వ్యక్తి, తన రెండు చేతులు జోడించి,సార్ దయచేసి స్మోకింగ్ మానేయండి అంటూ అర్ధించడం నిస్వార్థం గా అడగటం అరుదు.

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 06 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రోడ్డు పక్కన దమ్ము కొడుతున్న వారి వద్ద ఆకస్మికంగా ఆగి వినమ్రంగా  ప్రార్థిస్తున్నారు. పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్

IMG-20250206-WA0568
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్..

, గురువారం నాడు ఖైరతాబాద్ సోమాజిగూడ రోడ్డు లో కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన దమ్ము కొడుతూ కనపడగా వారిని కలసి తన దైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అన్నా..సిగరెట్ తాగే ముందు ఒక్క సారి హృదయం గురించి ఆలోచించరా.. ప్లీజ్ అంటూ ప్రార్డనా పూర్వకంగా అర్ధించారు.ఫిబ్రవరి 4 ప్రపంచ కేన్సర్ దినోత్సవం నుంచి వారాంతం వరకు పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను స్మోకర్స్ కు వివరిస్తున్నట్టు రఘునందన్ చెప్పారు. ఇరవై ఏళ్ల నుంచి చేస్తున్న తన ప్రయత్నం వల్ల ఎంతో మంది దమ్ము కొట్టడం మానేశారని "మాచన"చెప్పారు.స్మోకింగ్ వల్ల శరీర కణాలు సత్తా కోల్పోయి కాన్సర్ వచ్చే అవకాశం ఉందని రఘునందన్ వివరించారు.కాన్సర్ వచ్చాక ఆరోగ్యం గురించి బెంగ పడే బదులు ముందే జాగ్రత్త పడి ధూమపానం మానేస్తే మంచిదని మాచన రఘునందన్ హిత బోధ చేశారు.

Read More మర్రి"తో "మాచన" అనుభందం...

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే... గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే... పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్.... నల్లగొండ జిల్లా, ఫిబ్రవరి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-...
ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!
జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..