రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్...
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి
మాచన రఘునందన్...
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 10, (

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన నల్లగొండ జిల్లా మర్రిగూడ లో మాట్లాడుతూ.. రేషన్ బియ్యం ను అధిక ధర కు అక్రమంగా సేకరించి దందా చేయడం అలవాటు గా పెట్టుకున్న వారిపై పీ డి యాక్ట్ నమోదు చేయడం ఖాయం అని హెచ్చరించారు.రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా సమాచారం పై నిఘా వేసి పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు.ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసే డీలర్ల పై సైతం క్రిమినల్ కేసుల నమోదు కు వెనుకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు కూడా రేషన్ బియ్యం ను తినాలని సూచించారు.అధిక ధరకు అమ్ముకోవడం నేరం అని స్పష్టం చేశారు.
Comment List