మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...

కీచక ప్రిన్సిపాల్ పై చర్యలకు డిమాండ్... 

On
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన..

పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట... 

Screenshot_2025-02-07-14-23-29-24_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట... 

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలింపు...

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన...

Read More గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...

ప్రిన్సిపాల్ దినవన్ రావు పై పోక్సో కేసు నమోదు...

Read More ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!

పోలీసులు అదుపులో కీచక ప్రిన్సిపల్...

Read More దాహార్తిని తీర్చండి

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 07, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపల్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారు పాఠశాలకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు గంటసేపు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు ఒక్క సారిగా పాఠశాలలకు తోసుకుపోయే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు.. ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరకు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అంతకుముందు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాయికాడి శంకర్ మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిలపై కీచక పర్వానికి పాల్పడితే వారికి రక్షణ ఎక్కడ ఉటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కీచక ప్రిన్సిపల్ పై జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా సదరు బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితిని కల్పించాలని మండిపడ్డారు. ఓవైపు విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మైనర్ బాలికపై లయోలా పాఠశాల ప్రిన్సిపల్ ఇలాంటి అగాయిత్యానికి పాల్పడిన ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఇలాంటి ఘటనపై స్పందించకపోతే జిల్లా అధికార యత్రాంగం ఏ ఘటనకు స్పందిస్తుందని ప్రశ్నించారు. విద్యార్థులు ప్రాణాలు పోయిన తర్వాత హడావుడి చేసే అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ముందస్తుగానే తగు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా లయోలా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్న కేసును కప్పిపుచ్చుతున్నారని ప్రశ్నించారు. కేసు తప్పుదారి పట్టించేందుకే ప్రభుత్వ యంత్రాంగం కీచక ప్రిన్సిపాల్ పక్షంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుందని ఆందోళన వెలిబుచ్చారు.  విద్యార్థుల ప్రాణాలు అంటే ప్రభుత్వాలకు లెక్క లేకుండా పోయిందన్నారు. చివరికి కీచకులు.. మైనర్ బాలికలను కూడా వదలడం లేదని అందుకు లయోలా పాఠశాలలో జరిగిన ఉదాహరనే నిదర్శనమన్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని.. అప్పటి వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

*ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు..*

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో లయోలా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న దినావన్ రావ్ అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని పై బుధవారం లైంగికదాడి చేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన బాలిక తన తల్లితో విషయం చెప్పగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ పై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలోనూ విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా అతనిపై ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో కీచక ప్రిన్సిపాల్..!

మైనర్ విద్యార్థిని పై లైంగికదాడికి పాల్పడిన కీచక ప్రిన్సిపల్ దినావన్ రావ్ ను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటనపై గురువారం మైనర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు వీడియో చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లయల పాఠశాలయ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, తరంగ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

Views: 87

About The Author

Post Comment

Comment List

Latest News

గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే... గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే... పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్.... నల్లగొండ జిల్లా, ఫిబ్రవరి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-...
ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!
జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..