సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పోస్టర్ విడుదల
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) డిసెంబర్ 8:కొత్తగూడెం జమాఅత్- ఎ-ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఆదివారం వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్ మాట్లాడుతూ ... గత 75 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న సంస్థ. నిరుపేదలు, అవసరార్థులకు సహాయం చేస్తూ బాధితులకు ఉపశమనం అందించడం, వితంతువులకు ఆర్ధిక సహాయ, అనాథలు, నిరాశ్రయులైన పిల్లల చదువులకు సహాయపడడం వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఆని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్లినికులు, మట్టి-స్పెపాలిటి ఆసుపత్రులు నిర్వహిస్తూ, ఈ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతోంది అన్నారు.సాంకేతిక విద్యాభ్యాసం చెయాలనుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు సహాయమందిస్తుంది. తెలంగాణలోని వివిధ ప్రదేశాలలో కంప్యూటర్ కేంద్రాలు నడుపుతోంది. ఇక్కడ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా లభిస్తోందిఅని తెలిపారు.ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు, జమాఅత్-ఎ-ఇస్లామి హింద్ సమాజం నుండి చెడులను నిర్మూలించడానికి, సన్మార్గాన్ని, మంచి పనులను ప్రొత్సహించడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో శాంతిని, ప్రశాంత వాతావరణాన్ని కాపాడ్డానికి కృషి చేస్తుంది. మానవాళికి సరైన మార్గం చూపించడానికి, బలహిన వర్గాలు, వెనుకబడిన తరగతుల సామాజిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంది.మెరుగైన పరిపాలన కోసం, ప్రజలకు మేలు చేసే విధానాల కోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని జమాఅతె ఇస్లామి హింద్ గుర్తు చేస్తోంది. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మైనారిటీలు ఆశిస్తు, తమకే కాదు ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరికి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థల్లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలు తక్షణం పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు.ఖమ్మం వరదలు బారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమయ్యాయి. జమాఅతె ఇస్లామి హింద్ నాయకత్వం, ఖమ్మం కార్యకర్తలు సకాలంలో స్పందించి, వరద బాధితులకు సహాయమందించారు. పునరావాస కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. జమాఅత్ బృందం 5,000 కన్నా ఎక్కువ మంది బాధితులను గుర్తించి, రేషన్ కిట్లు, ఆహార ప్యాకెట్లు, పాత్రలు, గృహోపకరణాలను పంపిణీ చేయడం జరిగింది ఆని,అంతేకాదు ఇళ్లు ధ్వంసమైన కొందరికి ఆశ్రయం కల్పించడం ,వరదల వల్ల నష్టపోయిన వ్యాపారస్తులకు సహాయసహకారాలు అందించడం జరిగింది. బాధితులలో అవసరమైన వారికి వీల్ చైర్లు, ఈ-రిక్షాలను అందించే ఆలోచనలు కూడా చేస్తున్నామన్నారు.హైదరాబాదులో జలాశయాల పరిసరాలలో చట్టవిరుద్ధంగా కట్టిన నిర్మాణాలు, భవనాల కూల్చివేత కార్యక్రమం హైడ్రా చేపట్టింది. కాని ఈ కూల్చివేతల పట్ల ప్రజల్లో ముఖ్యంగా కూల్చివేతలకు గురయిన ప్రాంతాల్లో నివాసాలను కోల్పోయిన వారిలో వ్యతిరేకత, ఆగ్రహావేశాలు, ఆందోళనలున్నాయి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత, అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే, పేద ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించాలని జమాఅతె ఇస్లామి హింద్ విజ్ఞప్తి చేసిందన్నారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. మెదక్ ఉద్రిక్తతల తరువాత, విద్వేష శక్తులు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో మస్జిదులపై దాడులకు పాల్పడ్డాయి. ముస్లింల వ్యాపారాలు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విద్వేష శక్తులు సికింద్రాబాద్, జహీరాబాద్లో కూడా సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించాలి. గత ప్రభుత్వకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు కాపాడ్డానికి సత్వర చర్యలు తీసుకోవాలి. సమాజంలో శాంతి సామరస్యాలు కాపాడాలి.వక్స్ (సవరణ) బిల్లు 2024 విషయంలో జమాఅతె ఇస్లామి హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతిపాదిత సవరణలు వక్స్ ఆస్తులకు నష్టం కలిగిస్తాయని, వక్స్ ఆస్తుల నిర్వహణను దెబ్బతస్తాయని జమాఅల్ బావిస్తోంది. ఈ బిల్లు మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లబించిన హక్కులకు దెబ్బ తీస్తుంది. దేశవ్యాప్తంగా వక్స్ సంస్థల స్వేచ్ఛా స్వతంత్రాలకు విరుద్ధమైనది. కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని జమాఅల్ ప్రశంసిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వక్స్ ఆస్తుల దురాక్రమణలు తొలగించి, దుర్వినియోగాన్ని అరికట్టి, వక్స్ ఆస్తులను కాపాడాలని కోరుతోంది.తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి, అలాగే మెరుగైన సమాజనిర్మాణంలో జర్నలిస్టులు తమ పూర్తి పాత్ర పోషించాలని, సామరస్యాన్ని భంగపరిచే ఫేక్ వార్తలు, వదంతులు వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుతోంది. జర్న లిస్టులు ప్రజా సమస్యలను హైలైట్ చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు . ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో చదువుకునే విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నయీముద్దీన్ అహ్మద్, రాష్ట్ర మీడియా కార్యదర్శి వసివుల్లా, జిల్లా అధ్యక్షులు ఉమర్ ఫరూక్ మజ్దని, పట్టణ అధ్యక్షులు జహంగీర్ షరీఫ్, రుద్రంపూర్ అధ్యక్షులు అబ్దుల్ బాషిత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List