పెద్దకడుబూరులో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య...!
న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం జనవరి 30 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో విషాద ఘటన అలుముకుంది. చెట్టుకు ఉరివేసుకొని తంబల రంగస్వామీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తంబల రంగస్వామి వయస్సు(33) సం; గ్రామంలోని స్థానిక లక్షిపేటలో తల్లి, కొడుకు(రంగస్వామీ) నివాసం ఉన్నారు. బంధువారం రోజు ఉదయం ఎల్ఎల్సి కాలువ సమీపంలోని తన పొలానికి వెళ్లి అక్కడున్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకు తంబల రంగస్వామీకి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఒక కూతురు ఉందని, కాని రెండు సంవత్సరాలుగా భార్య భర్తలు గొడవపడి భార్య పుట్టింటిలో వెళ్లిపోవడం జరిగిందన్నారు. చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపిన భార్య కాపురానికి రాకపోవడంతో ఇద్దరు విడిగానే ఉన్నారని,అయితే మనస్థాపానికి గురైనా తంబల రంగాస్వామీ పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకున్న ఈ విశాద ఘటనలో మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది...
Comment List